
Kids Health: మీ పిల్లలతో వ్యాయామం చేయించండిలా!
ఇంటర్నెట్ డెస్క్: వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాయామం పెద్దలకు మాత్రమేనా పిల్లల సంగతేంటి?
వారి శరీరానికి కూడా వ్యాయామం అవసరం. పిల్లలు ఎక్కువగా తరగతి గదిలో గంటలపాటు కూర్చుని ఉండిపోతారు. ఈ కరోనా దెబ్బకు ఇంటికే పరిమితమయ్యారు. గంటల తరబడి ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే వ్యాయామం సంగతేంటి? ఇలా చేసి చూడండి
వీటిని కొనివ్వండి
సాధారణంగా పిల్లలకు బొమ్మలను కొనిస్తూనే ఉంటారు. వాటికి బదులుగా వారికి ఉపయోగపడేలా స్కిప్పింగ్, బాడ్మింటన్ రాకెట్ లాంటి ఆట పరికరాలను కొనివ్వండి. ఇలా చేయడం వల్ల వారికి బోర్‌గా అనిపించకుండా వీటితో ఆడుకుంటారు.
విహార యాత్రకు వీటినీ తీసుకెళ్లండి
పిల్లలను తల్లిదండ్రులు బయటకు తీసుకెళ్లాలనుకుంటే సెలవు రోజుల్లో కొంత విభిన్నంగా ప్రణాళికలను రూపొందించండి. స్విమ్మింగ్, మౌంటెన్ బైకింగ్ ఉండే ప్రాంతాలకు తీసుకెళ్లాలి. దీంతో ప్రకృతితో వారు మమేకం కాగలరు. ఇటువంటివి చేయడం అలవాటుగా చేసుకుంటే ఆనందకర కుటుంబాన్ని పొందగలరు.
ఇంటి పనులు చేసేలా ప్రోత్సహించండి
ఇంటిలో పనులకు పిల్లలను దూరంగా ఉంచుతారు తల్లిదండ్రులు కానీ అలా చేయడం మంచి పద్ధతి కాదు. వారికి చిన్న చిన్న పనులు చేసేలా ప్రోత్సహించాలి. వారు పనులు నేర్చుకున్నట్లూ ఉంటుంది. పనులు చేస్తుంటే వారి శరీరానికి వ్యాయామం చేసినట్లు కూడా ఉంటుంది.
టీవీ టైమ్‌ను తగ్గించండి
టీవీ చూస్తే కుటుంబం అంతా కలిసి చూడండి. వారికి రిమోట్ ఇచ్చేసి వదిలేయకూడదు. ఇలా చేయడం వల్ల వారు గంటల తరబడి తెరను చూస్తూనే ఉంటారు. దీంతో కంటి సమస్యలు తలెత్తుతాయి. అలాకాకుండా మీరు పిల్లలతో ఆడుకోండి. వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోండి. మీరు వారితో సమయం గడపకుంటే పిల్లలు మానసికంగా కుంగిపోతారు. ఒంటరిగా ఫీల్ అవుతారు.
ఈ కొద్ది పాటి మార్పులు చేసుకొని పిల్లలను వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
Social Media: 87% భారతీయులు ఇదే నమ్ముతున్నారు
-
Ap-top-news News
OTS: సచివాలయాల ఉద్యోగుల మెడపై ఓటీఎస్ కత్తి
-
Ts-top-news News
Weather Forecast: చురుగ్గా రుతుపవనాల కదలిక.. తెలంగాణలో నేడు భారీ వర్షాలు
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
-
Crime News
Crime News: షాకింగ్! ఆసుపత్రిలో శిశువును ఎత్తుకెళ్లిన శునకాలు.. ఆపై విషాదం!
-
India News
Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- గెలిచారు.. అతి కష్టంగా
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- డీఏ బకాయిలు హుష్‌కాకి!
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- Ire vs Ind: ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం.. సిరీస్ కైవసం