
పోలీస్‌స్టేషన్‌కు క్యూ కట్టిన పెళ్లి కుమారులు
భోపాల్: ఇన్నాళ్లకు ఓ సంబంధం కుదిరింది అని ఆనందంలో పెళ్లి మండపానికి వెళ్లిన పెళ్లి కుమారులకు, వారి కుటుంబభ్యులకు షాక్ తగిలింది. కోలాహలంగా ఉండాల్సిన పెళ్లి మండపాలు తాళం వేసి ఉండటం చూసి వారు నోరెళ్లబెట్టారు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఓకే రోజు ఐదుగురు పెళ్లి కుమారులకు ఇదే పరిస్థితి ఎదురైంది. మధ్యప్రదేశ్‌లోని హార్దా జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాకు చెందిన ఓ యువకుడికి ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఓ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం ఆయన వివాహం జరగాల్సి ఉంది. అయితే కుటుంబసభ్యులతో ముహూర్త సమయానికి పంక్షన్‌హాల్‌కు వెళ్లిన వరుడికి షాక్ తగిలింది. ఆ వివాహ వేదికి మూసివేసి ఉంది. వధువుకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు వరుడు, ఆయన బంధువులు కోలార్ రోడ్ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అయితే అక్కడ మరో నలుగురు పెళ్లి కుమారులు ఉండటం చూసి విస్మయానికి గురయ్యారు. వారు కూడా అతడిలాగే మోసపోయి ఫిర్యాదు చేసేందుకు వచ్చినవారు కావడం గమనార్హం.
సీఎస్పీ భూపేంద్రసింగ్ మాట్లాడుతూ ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా వారిని గుర్తించి అరెస్టు చేశామని, సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ‘యువకులకు పెళ్లి సంబంధం కుదరడం కష్టంగా ఉండే జిల్లాలను ఈ ముఠా ఎంచుకుంటుంది. అక్కడ పెళ్లి సంబంధాలు కుదిర్చేవారికి వారి ఫోన్ నంబర్లు ఇస్తారు. వారి వద్ద నుంచి యువకుల ఫోన్ నంబర్లు కూడా తీసుకుంటారు. యువతిని చూపిస్తామని యువకులకు ఫోన్ చేసి భోపాల్‌కు రప్పించుకుంటారు. అక్కడే ఓ యువతిని పరిచయం చేసి ఆమె నచ్చితే వరుడి వద్ద నుంచి రూ.20 వేలు తీసుకుంటారు’ అని సీఎస్పీ వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.