Kerala: వయసు 75 ఏళ్లు.. కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌..

రామా, క్రిష్ణా అనుకునే వయసులో ఓ పెద్దాయన కరాటే కిక్కులతో అదరగొడుతున్నారు. కేరళలోని ఇడుక్కికి చెందిన ఎస్‌టీ అగస్టీ 75 ఏళ్ల వయసులో కరాటేలో అత్యుత్తమంగా భావించే బ్లాక్ బెల్ట్ కైవసం చేసుకున్నారు. తన 58 ఏళ్ల వయసు నుంచి కరాటే నేర్చుకోవటం ప్రారంభించానని ఆయన చెప్పారు.

Published : 30 Apr 2022 20:07 IST

ఇడుక్కి : కేరళలోని ఇడుక్కిలో ఓ పెద్దాయన కరాటే కిక్కులతో అదరగొడుతున్నారు.  ఎస్‌టీ అగస్టీ 75 ఏళ్ల వయసులో కరాటేలో అత్యుత్తమంగా భావించే బ్లాక్ బెల్ట్ కైవసం చేసుకున్నారు. తాన 58 ఏళ్ల వయసు నుంచి కరాటే నేర్చుకోవటం ప్రారంభించానని అగస్టీ చెప్పారు. గతంలో  గ్రామ సర్పంచ్‌గా పనిచేశానని, రోజులో ఎక్కువ సమయాన్ని మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తానని, కరాటే నేర్చుకోవటం ప్రారంభించిన నాలుగేళ్లలోనే మొదటి ర్యాంక్ బ్లాక్ బెల్ట్ సాధించానని ఆయన తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే తపన నిబద్ధతకు అగస్టీ నిదర్శనమని ఆయన మాస్టర్ కవలక్కట్ జోష్ తెలిపారు. కరాటే, వ్యాయామం చేయటం వల్ల తాను ఒత్తిడికి లోనవ్వనని, మధుమేహం తన దరిచేరవని అగస్టీ అన్నారు. ఈ వయసులో ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకునేందుకు వ్యాయామం చాలా మంచిదని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని