Andhra News: ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం
పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తాం: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నట్టు గత రాత్రి సందేశాలు వచ్చాయన్నారు. తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.83వేలు విత్‌డ్రా చేశారని పేర్కొన్నారు. డబ్బులు ఎవరు తీసుకున్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ డీఏ ఎరియర్స్ జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తామన్నారని, గడిచిన 6 నెలలుగా ఇచ్చిన డీఏ ఎరియర్స్‌ను మళ్లీ వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు.
గతంలోనూ ఇదే తరహాలో జరిగితే ఫిర్యాదు చేస్తే మళ్లీ తిరిగి వేశారని గుర్తు చేశారు. తాజాగా మొత్తం 90వేల మంది ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్ల వరకు వెనక్కి తీసుకున్నారని తెలిపారు. ఆర్థికశాఖకు ఫిర్యాదు చేసేందుకు వెళితే.. అధికారులు అందుబాటులో లేరని చెప్పారు. ఈ తరహా ఘటనలు ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయా? లేక ఉన్నతాధికారుల తప్పిదమో తెలియడం లేదన్నారు. ఉద్యోగుల సమ్మతి లేకుండా వారి ఖాతాల నుంచి సొమ్ము విత్‌డ్రా చేయడం నేరమని సూర్యనారాయణ పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తామని తెలిపారు. మార్చి నెలలో జరిగిన లావాదేవీలను అకౌంటెంట్ జనరల్ తమకు ఇప్పటి వరకు తెలియజేయకపోవడం కూడా తప్పిదమేనన్నారు. ఆర్థిక శాఖలోని సీఎఫ్ఎంఎస్లో ఉన్న సీపీయూ యూనిట్ వద్ద తమ వేతన ఖాతాల నుంచి విత్ డ్రా చేసే సాంకేతికత ఉందని, ఇది ఎంత వరకు చట్టబద్దమని ప్రశ్నించారు. దీనిపై లోతైన విచారణ జరగాలని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR-Pawan Kalyan: రామ్ భాయ్.. మీ ఛాలెంజ్ స్వీకరించా: పవన్‌కల్యాణ్
-
India News
ISRO: SSLV తుది దశ సమాచార సేకరణలో స్వల్ప జాప్యం
-
World News
Israel: పీఐజే రెండో టాప్ కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్..!
-
World News
America Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. నలుగురి మృతి
-
India News
India Corona : 19 వేల దిగువకు కొత్త కేసులు..
-
General News
ISRO: షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/08/2022)
- Heavy Rains: రెడ్ అలర్ట్.. నేటి నుంచి 3 రోజులు అతి భారీవర్షాలు
- సూర్య అనే నేను...