కాళ్లుచేతులు కట్టుకొని..పది కిలోమీటర్లు ఈత కొట్టి..

మీకు ఈతకొట్టడం వచ్చా? వస్తే ఎప్పుడైనా బావులు, చెరువులు, స్విమ్మింగ్‌ పూల్స్‌లో సరదా కోసమో, వ్యాయమం కోసమో ఈతకొట్టాడానికి వెళ్లి ఉంటారు కదూ. అయితే మీరు ఈత ఎలా కొడతారు? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? కానీ ఓ వ్యక్తి మాత్రం కాళ్లు చేతులు బంధించుకుని

Updated : 23 Nov 2020 05:28 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌ : మీకు ఈతకొట్టడం వచ్చా? వస్తే ఎప్పుడైనా బావులు, చెరువులు, స్విమ్మింగ్‌ పూల్స్‌లో సరదా కోసమో, వ్యాయమం కోసమో ఈతకొట్టాడానికి వెళ్లి ఉంటారు కదూ. అయితే మీరు ఈత ఎలా కొడతారు? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? కానీ ఓ వ్యక్తి మాత్రం కాళ్లు చేతులు బంధించుకుని ఈదుతాడు. అది కూడా కిలోమీటర్ల దూరం. ఆశ్చర్యంగా ఉంది కదా! ఎవరతడు అని తెలుసుకోవాలని అనిపిస్తోందా? అయితే ఓ సారి కేరళకు వెళ్దాం పదండి మరి!

కేరళకు చెందిన స్విమ్మర్‌ రతీశ్ అరుదైన ఫీట్‌ చేశాడు. కాళ్లు చేతులు బంధించి ఉండగా పది కిలోమీటర్ల దూరం ఈతకొట్టి రికార్డు సృష్టించాడు. గిన్నిస్‌ రికార్డు కోసం అతడు ఈ ప్రయత్నం చేశాడు. తిరువనంతపురం-షోర్నూర్‌ మధ్య ఉన్న కాలువ నీటిలో ఆటుపోటులు, సుడిగుండాలు ఎదురైనా అయిదు గంటల్లో ద్విగిజయంగా  ఫీట్‌ను పూర్తిచేశాడు. ఈత కొట్టే సమయంలో చేతుల మధ్య 20 సెం.మీ దూరం మాత్రమే ఉండేలా బేడీలు వేసుకున్న అతడు కాళ్లమధ్య 30 సెం.మీ దూరం ఉండేలా తాడుతో కట్టుకున్నాడు. మొదటి తొమ్మిది కిలో మీటర్ల దూరాన్ని నాలుగు గంటల్లో ఈదిన రతీశ్‌ చివరి కిలోమీటరు దూరం ఈదటానికి గంటన్నరకు పైగా సమయం తీసుకున్నాడు. ఈ ప్రదర్శనతో కర్ణాటక ఉడిపీకి చెందిన వ్యక్తి పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డు గురించి గిన్నిస్‌ బుక్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక లిమ్కాబుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లో మూడు సార్లు చోటు దక్కించుకున్న రతీశ్‌ అరేబియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ ఒకసారి చోటు దక్కించుకున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని