టీషర్ట్‌ మీద టీషర్ట్‌.. మొత్తం 260!

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో పేరు నమోదు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. రికార్డుల కోసం ఎంతటి పనినైనా చేయడానికి సిద్ధపడిపోతుంటారు...

Published : 23 Aug 2020 23:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్: గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో పేరు నమోదు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. రికార్డుల కోసం ఎంతటి పనినైనా చేయడానికి సిద్ధపడిపోతుంటారు కొందరు. అలా కష్టపడి రికార్డు సాధించిన వారి వీడియోలను గిన్నిస్‌ బుక్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంది. కొద్ది రోజుల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచిన ‘ఎక్స్‌స్ట్రీమ్‌ బాస్కెట్‌ బాల్‌ ఛాలెంజ్‌ ’ వీడియోకు వీక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో అసాధారణమైన ఫీట్‌ను అభిమానులకు గిన్నిస్‌బుక్‌ షేర్‌ చేసింది. ఒక దాని మీద మరొక టీ షర్ట్‌.. ఇలా దాదాపు 260 టీషర్టులను ధరించి గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లోకి ఎక్కాడు టెడ్‌ హాస్టింగ్స్‌ అనే వ్యక్తి. అయితే ఈ ఫీట్‌ను టెడ్‌ హాస్టింగ్స్ 2019లో సాధించాడు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్‌ బుక్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచింది. 

టెడ్‌ హాస్టింగ్స్‌ ఎందుకు ఇలాంటి ఫీట్‌ను ఎంచుకున్నాడనే దాని గురించి గిన్నిస్‌ సంస్థ ఇన్‌స్టాలో వివరణ ఇచ్చింది. ‘ఓ రోజు తన పిల్లలతో కలిసి 2019లో గిన్నిస్‌ ప్రపంచ రికార్డులను చూస్తుండగా.. నువ్వు ఎప్పుడు అధికారికంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ టైటిల్‌ను అందుకుంటావని టెడ్‌ చిన్న కుమారుడు అడిగాడు. దానిని గొప్ప అవకాశంగా భావించి తన పిల్లలకు కష్టపడటం, నిబద్ధత వంటి వాటిని నేర్పాలని భావించాడు. అందుకే ఇలాంటి వినూత్నమైన ఛాలెంజ్‌ను ఎంచుకున్నాడు’’ అని గిన్నిస్ సంస్థ రాసుకొచ్చింది. వీడియోకు దాదాపు 34వేల లైక్స్‌, వందల కామెంట్స్‌ వచ్చాయని పేర్కొంది. ‘నువ్వు ధరించిన వాటి బరువు ఎంత?’, ‘నేను తప్పకుండా నీ రికార్డును బీట్‌ చేస్తా’ అంటూ ఇన్‌స్టా యూజర్లు కామెంట్స్‌ పెడుతున్నారు. అయితే హాస్టింగ్స్‌ ఏ దేశానికి చెందిన వారో వెల్లడించలేదు. మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేసి ఆనందించండి మరి...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని