‘3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు’పై యథాతథ స్థితి

ఆంధ్రప్రదేశ్‌లో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు యథాతథ స్థితిని (స్టేటస్‌ కో) కొనసాగించాలని...

Published : 04 Aug 2020 16:49 IST

ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు

విచారణ ఆగస్టు 14కి వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు యథాతథ స్థితిని (స్టేటస్‌ కో) కొనసాగించాలని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలుకు 10 రోజులు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అప్పటివరకు స్టేటస్‌ కో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. 

ఇప్పటికే మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృతాభివృద్ధి చట్టాన్ని (యాక్ట్‌ నం.28 ఆఫ్‌ 2020) రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రం (గెజిట్‌)లో ప్రచురించింది. ఆ చట్టం ప్రకారం ఇకపై రాష్ట్రానికి అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయి. అలాగే.. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా (ఏఎంఆర్‌డీఏ)గా మారుతుంది. ఈ మేరకు మరో కొత్త చట్టాన్ని (యాక్ట్‌ నం.27 ఆఫ్‌ 2020) ఆంధ్రప్రదేశ్‌ రాజపత్రంలో ప్రభుత్వం ప్రచురించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని