‘యాంటీబాడీస్‌ అభివృద్ధిని పరిశీలిస్తున్నాం’

రాష్ట్రంలో సీరో సర్వేను నిన్నటి (శుక్రవారం) నుంచి మొదలు పెట్టినట్లు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. విజయవాడలో..

Updated : 08 Aug 2020 15:46 IST

ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌ రెడ్డి

విజయవాడ: రాష్ట్రంలో సీరో సర్వేను నిన్నటి (శుక్రవారం) నుంచి మొదలు పెట్టినట్లు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. విజయవాడలో విలేకర్లతో జవహర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎంత శాతం మందిలో యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందిందో పరిశీలిస్తామన్నారు. తద్వారా కరోనా చికిత్స వ్యూహం మార్చుకోవచ్చని చెప్పారు. కరోనా మరణాలు తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. తీవ్ర జ్వరం, శ్వాస కోశ సమస్యలుంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారు. టెస్టులతో సంబంధం లేకుండా ఆసుపత్రిలో చేర్చుకోవాలని ఆదేశించామని వెల్లడించారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు 104 నెంబరుకు కాల్‌ చేయాలని తెలిపారు. 
‘94శాతం కంటే తక్కువ ఆక్సిజన్‌ ఉన్న వారు వాలంటీర్‌, ఏఎన్‌ఎంకు చెప్పాలి. లేదా 104 నెంబరుకు కాల్‌ చేయాలి. చివరి నిమిషంలో ఆస్పత్రికి వస్తే కోలుకోవడం కష్టం అవుతుంది. ప్రతి ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశాం. ఆస్పత్రి పడకల గురించి హెల్ప్‌ డెస్క్‌లో తెలుసుకోవచ్చు’’ అని జవహర్‌ రెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని