AP Budget 2022: శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన.. ముఖ్యాంశాలివే..

ఏపీ శాసనసభలో 2022-23 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి

Updated : 12 Mar 2022 01:43 IST

అమరావతి: ఏపీ శాసనసభలో 2022-23 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,56,257 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. దీనిలో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు అంచనా రూ.17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724 కోట్లుగా పేర్కొన్నారు.

బడ్జెట్‌ కేటాయింపులివే..

  • వైఎస్సార్‌ రైతుభరోసా- పీఎం కిసాన్‌ యోజన రూ.3,900 కోట్లు
  • వైఎస్సార్‌ ఉచిత పంట బీమా- రూ.1802 కోట్లు
  • వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు- రూ.500 కోట్లు
  • రైతుభరోసా కేంద్రాలకు రూ.18 కోట్లు
  • వ్యవసాయ, మార్కెటింగ్‌- ధరల స్థిరీకరణ నిధి- రూ.500 కోట్లు
  • వైఎస్సార్‌ వ్యవసాయ పరీక్షా కేంద్రాలు- రూ.50 కోట్లు
  • ఉచిత, రాయితీపై విద్యుత్‌ సరఫరా రూ.5000 కోట్లు
  • పశుసంవర్థక, పాడి, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ.1,568 కోట్లు
  • వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాకు రూ.300 కోట్లు
  • వైద్య ఆరోగ్య- కుటుంబ సంక్షేమానికి 15,384 కోట్లు
  • వైఎస్సార్‌ ఆసరా రూ.6400 కోట్లు
  • హోంశాఖకు రూ. 7,586 కోట్లు
  • వైఎస్సార్‌ సున్నా వడ్డీ రూ.800 కోట్లు
  • వైఎస్సార్‌ చేయూత 4,235 కోట్లు
  • మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు రూ.4,322 కోట్లు
  • వైఎస్సార్‌ పింఛను కానుక రూ.18,000 కోట్లు
  • వైఎస్సార్‌ బీమా రూ.372 కోట్లు
  • వైఎస్సార్‌ వాహన మిత్ర రూ.260 కోట్లు
  • వైఎస్సార్‌ నేతన్న నేస్తం రూ.200కోట్లు
  • జగనన్న తోడు రూ.25 కోట్లు
  • జగన్న చేదోడు రూ.300 కోట్లు
  • వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం రూ.590
  • వైఎస్సార్‌ లా నేస్తం రూ.15 కోట్లు
  • వైఎస్సార్‌ కాపు నేస్తం రూ.500 కోట్లు
  • ఎస్సీ సబ్‌ ప్లాన్‌కు రూ.18,518 కోట్లు
  • ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,145 కోట్లు
  • బీసీ సబ్‌ప్లాన్‌కు రూ.29,143 కోట్లు
  • మైనార్టీ సంక్షేమానికి రూ.3,661 కోట్లు
  • కాపు సంక్షేమానికి రూ.3,537 కోట్లు
  • జగనన్న అమ్మ ఒడికి రూ.6,500 కోట్లు
  • మనబడి-నాడు, నేడు 3,500 కోట్లు
  • పాఠశాల విద్య రూ.27,706 కోట్లు
  • జగనన్న విద్యాదీవెనకు రూ.2,500 కోట్లు
  • జగనన్న వసతి దీవెనకు రూ.2,083 కోట్లు
  • ఉన్నత విద్య కోసం రూ.2,014 కోట్లు
  • పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి రూ.4,791కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ.15,846 కోట్లు
  • పురపాలక, పట్టణాభివృద్ధికి రూ.8,796 కోట్లు
  • నీటి వనరుల అభివృద్ధికి రూ.11,482 కోట్లు
  • పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.2,755కోట్లు
  • రవాణ, రోడ్లు, భవనాల శాఖకు రూ.8,581కోట్లు
  • ఇంధన శాఖకు రూ.10,281కోట్లు
  • నియోజకవర్గాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి రూ.350 కోట్లు

ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగ పాఠం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని