వరదప్రభావిత ప్రాంతాల్లో జగన్‌ విహంగవీక్షణం

ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను ఏపీ సీఎం సీఎం జగన్‌ పరిశీలించారు. వరద పోటెత్తిన ప్రాంతాలను విహంగ వీక్షణం (ఏరియల్‌ సర్వే) ద్వారా ఆయన తిలకించారు.

Updated : 18 Aug 2020 17:37 IST

రాజమహేంద్రవరం: ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను ఏపీ సీఎం సీఎం జగన్‌ పరిశీలించారు. వరద పోటెత్తిన ప్రాంతాలను విహంగ వీక్షణం (ఏరియల్‌ సర్వే) ద్వారా ఆయన తిలకించారు.ఆయా చోట్ల పంటలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో హెలికాప్టర్‌ నుంచి సీఎం గమనించారు. సీఎం జగన్‌తో పాటు మంత్రులు సుచరిత, పేర్ని నాని ఉన్నారు. 

అంతకుముందు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని