ఏపీలో కరోనా.. కొత్తగా 9,536 కేసులు

ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 72,233 నమూనాలను పరీక్షించగా 9,536 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,67,123కి చేరింది.

Updated : 13 Sep 2020 18:23 IST

అమరావతి: ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 72,233 నమూనాలను పరీక్షించగా 9,536 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,67,123కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ 66 మంది మృతిచెందారు. అనంతపురంలో జిల్లాలో 7 మంది, నెల్లూరు 7, ప్రకాశం 7, కడప 6, విశాఖపట్నం 6, చిత్తూరు 5, తూర్పుగోదావరి 5, కృష్ణా 5, కర్నూలు 5, గుంటూరు 4, విజయనగరం 4, పశ్చిమగోదావరి 3, శ్రీకాకుళంలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4912కి చేరింది. 24 గంటల వ్యవధిలో 10,131 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 45,99,826 నమూనాలు పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. 95,072 యాక్టివ్‌ కేసులున్నట్లు తెలిపింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని