అంతర్వేది అగ్నిప్రమాదంపై స్పందించిన డీజీపీ

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధమైన ఘటనపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారని చెప్పారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ ఆధ్వర్యంలోని

Updated : 06 Sep 2020 22:16 IST

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధమైన ఘటనపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారని చెప్పారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ ఆధ్వర్యంలోని ఓ బృందం ఘటనాస్థలానికి చేరుకుని తక్షణమే ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ మేరకు డీజీపీ ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎస్పీ, ఏలూరు డీఐజీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారన్నారు. విజయవాడ నుంచి ఫొరెన్సిక్‌ డైరెక్టర్‌ నేతృత్వంలో నిపుణుల బృందం ఘటనాస్థలానికి బయల్దేరిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయి సాక్ష్యాధారాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని డీజీపీ పేర్కొన్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని