పంచాయతీ ఎన్నికలపై హైకోర్టుకు ఏపీ సర్కార్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

Updated : 02 Dec 2020 12:55 IST

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలివేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విడుదల చేసిన ప్రకటనపై ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ఎస్‌ఈసీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటన చేశారని పిటిషన్‌లో ఆక్షేపించారు. ఎస్‌ఈసీ ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదన్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటికే 6వేల మందికిపైగా మరణించారని.. ఈ సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని పేర్కొన్నారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని