ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం

ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమకూ ఆధార్‌ తరహాలో ప్రత్యేక సంఖ్య ఇవ్వాలని నిర్ణయించింది. .....

Updated : 06 Sep 2022 16:39 IST

అమరావతి: ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమకూ ఆధార్‌ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని నిర్ణయించింది. ‘పరిశ్రమ ఆధార్’‌ పేరుతో ప్రత్యేక సంఖ్య జారీచేయనుంది. దీనికోసం రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల సర్వే నిమిత్తం ఉత్తర్వులు జారీచేసింది. పరిశ్రమల్లోని కార్మికులు, విద్యుత్‌, భూమి, నీటి లభ్యత గురించి తెలుసుకోవాలని నిర్ణయించింది. ఎగుమతి-దిగుమతి, ముడిసరకు లభ్యత, మార్కెటింగ్‌ సహా మొత్తం 9 అంశాల్లో వివరాలను పరిశ్రమల శాఖ సేకరించనుంది. మొబైల్‌ యాప్‌తో గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ఈ సర్వే చేయనున్నారు. సమగ్ర  పరిశ్రమ సర్వేకు జిల్లా స్థాయిలో కలెక్టర్‌, రాష్ట్ర స్థాయిలో పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. అక్టోబర్‌ 15 నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని