Published : 11 Aug 2020 00:46 IST

ఇసుక తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు


అమరావతి: ఇసుక తవ్వకాలు, రవాణా, సరఫరా క్రమబద్దీకరణలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక తవ్వకాలు, లోడింగ్‌, సరఫరా, డోర్‌ డెలివరీకి వివిధ స్థాయిల్లో బేస్‌ రేట్లు నిర్ణయిస్తూ గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్‌ రీచ్‌లు, పట్టాదారు భూముల్లో ఇసుక తవ్వకానికి టన్నుకు రూ.90గా నిర్ణయించారు. జేసీబీ ద్వారా ఇసుక లోడింగ్‌  రుసుము టన్నుకు రూ.25గా నిర్ధరించారు. ఇసుక రవాణాకు కిలోమీటరుకు రూ.4.90 చొప్పున వసూలు చేయనున్నారు. గోదావరి జిల్లాల నుంచి విశాఖకు ఇసుక రవాణా టన్నుకు జీఎస్టీతో కలిపి కి.మీ రూ.3.30గా నిర్ణయించారు. డోర్‌ డెలివరీ కోసం 10కి.మీ లోపు దూరానికి ట్రాక్టర్‌ ద్వారా టన్నుకు రూ.10, లారీ ద్వారా టన్నుకు రూ.8, పెద్ద లారీకి టన్నుకు రూ.7  వసూలు చేయనున్నారు. ఈ ధరలు 40 కి.మీ దూరం వరకు వర్తిస్తాయి. 40కి.మీ దాటితే ప్రతి టన్నుకు రూ అదనంగా 4.90 రూపాయల చొప్పున ధరను నిర్ణయించారు. కొత్త ధరలపై ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు ఏపీ ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని