ఎస్‌ఈసీకి సహకరించండి: ఏపీ హైకోర్టు

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై తీర్పునిచ్చింది. దీనిపై 15 రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Updated : 03 Nov 2020 15:24 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై తీర్పునిచ్చింది. దీనిపై 15 రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో సీఎస్‌ను సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ రమేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది. ప్రభుత్వం ఈసీకి సహకరించడం లేదని నిమ్మగడ్డ ఆరోపించారు. ఎక్కడ సహకరించడం లేదో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు అడగ్గా.. ఈసీకి రూ.40 లక్షలు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేయడం లేదని నిమ్మగడ్డ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తాజాగా తీర్పు వెల్లడించిన ఉన్నత న్యాయస్థానం ఎస్‌ఈసీకి సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని