అత్యుత్సాహం ప్రదర్శిస్తే సహించం‌: సుచరిత

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కారకులపై వెంటనే చర్యలు తీసుకున్నామని

Updated : 10 Nov 2020 10:27 IST

అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కారకులపై వెంటనే చర్యలు తీసుకున్నామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా పోలీసుల నుంచి వేధింపులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని హోంమంత్రి సూచించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసులు ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే సహించబోమని సుచరిత హెచ్చరించారు. 

గతంలో చీరాల ఘటనతో పాటు సీతానగరం శిరోముండనం వ్యవహారాల్లో ఈ విధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు హోంమంత్రి గుర్తు చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ దిశగా పోలీసులు పనిచేయాలని సూచించారు. ఈ తరహా ఘటనలకు బాధ్యులైన వారిని ఉపేక్షించవద్దని ఇప్పటికే సీఎం జగన్‌ ఆదేశించారని చెప్పారు. అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య నేపథ్యంలో ఆయన అత్తగారికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు సుచరిత తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశాయి.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని