పోలవరం పెండింగ్‌ నిధులివ్వండి

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు చెల్లించాల్సిన రూ.4 వేల కోట్ల పెండింగ్‌

Updated : 21 Sep 2020 15:01 IST

కేంద్రమంత్రిని కోరిన ఏపీ మంత్రి అనిల్‌

దిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు చెల్లించాల్సిన రూ.4 వేల కోట్ల పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని కోరారు. ఎత్తిపోతల పథకాలకు కేంద్ర సహకారంపైనా చర్చించారు.అనంతరం అనిల్‌ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థికశాఖతో సమన్వయం చేసుకొని త్వరలోనే నిధులు విడుదలయ్యేలా చూస్తామని గజేంద్రసింగ్‌ హామీ ఇచ్చారన్నారు. పోలవరాన్ని సందర్శించాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించామని చెప్పారు. కృష్ణా నదిపై కట్టే ప్రాజెక్టులతో రాయలసీమకు ఎలాంటి లాభం ఉంటుందో ఆయనకు వివరించామన్నారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో సీఎం జగన్‌ ఉన్నారని అనిల్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని