Published : 13 Oct 2020 01:56 IST

దసరాకు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

 

అమరావతి: దసరా నేపథ్యంలో దూరప్రాంతాలకు బస్సులు నడపాలని ఏపీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఈనెల 15 నుంచి 28 వరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు నడిచినట్లే దూరప్రాంతాలకు 2,028 బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా దసరా ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పించారు. డిమాండ్‌ మేరకు రిజర్వేషన్‌ చేసుకునే బస్సుల సంఖ్య పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రద్దీ మేరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులపై చర్చలు ఇంకా పూర్తి సఫలం కాకపోవడంతో తెలంగాణకు బస్సులు నడపడం లేదు. ఇరు రాష్ట్రాల చర్చలు కొలిక్కి వచ్చాకే తెలంగాణకు ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించాలని ఏపీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది.

 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని