‘గవర్నర్‌ నిర్ణయం చట్ట విరుద్ధం’

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో..

Published : 01 Aug 2020 01:58 IST

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల ఆమోదంపై మండిపడ్డ న్యాయవాదులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. గవర్నర్‌ నిర్ణయం చట్టానికి వ్యతిరేకమని అంటున్నారు. న్యాయ సమీక్షలో ఈ రెండు చట్టాలు కొట్టివేసే అవకాశం ఉందని సీనియర్‌ న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఇదే అంశంపై అమరావతి రైతుల తరఫున హైకోర్టులో పిటిషన్‌ వేసిన న్యాయవాది ప్రసాద్‌ బాబు స్పందించారు. ఆ బిల్లుపై గవర్నర్‌ సంతకం చేయడం బాధాకరమన్నారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు రాజ్యాంగం ప్రకారం నిలబడే అవకాశం లేదన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేసేలా సవరణ తీసుకొస్తామన్నారు.

బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు సైతం ఈ అంశంపై స్పందించారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ తీసుకున్న ఈ నిర్ణయం న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిలిచే అవకాశం లేదన్నారు. ‘కేంద్ర ప్రభుత్వ రూపొందించిన పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కి ఒకటే రాజధాని ఉండాలని  స్పష్టంగా తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరణ చేస్తేగానీ మూడు రాజధానులు ఏర్పడే అవకాశం లేదు. సెక్షన్‌ 31(2) ప్రకారం న్యాయశాఖ రాజధానికి మార్చే అవకాశం లేదు’ అని సుబ్బారావు అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలు చేసినా భారత రాజ్యాంగం అధికరణ 13 ప్రకారం చెల్లుబాటుకావు అని అన్నారు. గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం చట్టవ్యతిరేకమైనదిగా పేర్కొన్నారు.

పలువురు న్యాయ నిపుణుల అభిప్రాయాల కోసం కింది వీడియోను చూడండి..
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని