AP PRC: ప్రభుత్వంతో ఉపాధ్యాయుల చర్చలు విఫలం: యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

పీఆర్సీపై ప్రభుత్వంతో జరిపిన ఉపాధ్యాయుల చర్చలు విఫలమయ్యాయని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు

Updated : 06 Feb 2022 09:01 IST

అమరావతి: పీఆర్సీపై ప్రభుత్వంతో ఉపాధ్యాయులు జరిపిన చర్చలు విఫలమయ్యాయని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. ‘‘ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి చర్చలు ఆమోదయోగ్యం కాదు. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం.

ఉపాధ్యాయులకు హెచ్‌ఆర్‌ఏ 10 శాతమే ఇస్తామంటున్నారు. టీచర్లకు కనీసం 12 శాతం హెచ్ఆర్‌ఏ ఇవ్వాలి. ఇలా చేయలేకపోతే పాత హెచ్‌ఆర్‌ఏ విధానాన్నే కొనసాగించాలి. టీచర్లకు 27 శాతానికి పైగా ఫిట్‌మెంట్ కోరుతున్నాం. ఈ విషయమై సీఎం జగన్‌ వద్ద ప్రస్తావించే అవకాశం ఇవ్వబోమనడం అప్రజాస్వామికం’’ అని వెంకటేశ్వర్లు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని