15కిలోల చాక్లెట్‌తో రామమందిరం నమూనా

అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని పురస్కరించుకొని 15కిలోల చాక్లెట్‌తో ఆలయ నమూనాను అహ్మదాబాద్‌కు చెందిన శిల్పబెన్‌ అనే భక్తురాలు రూపొందించారు.

Updated : 29 Nov 2023 12:15 IST

అహ్మదాబాద్‌: అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని పురస్కరించుకొని 15కిలోల చాక్లెట్‌తో ఆలయ నమూనాను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన శిల్పబెన్‌ అనే భక్తురాలు రూపొందించారు. అయోధ్యలో నిర్మించబోయే రామమందిరం మాదిరి నమూనాను అందంగా తీర్చిదిద్దారు. తయారీ కోసం రుచికరమైన చాక్లెట్‌ను ఉపయోగించినట్లు ఆమె పేర్కొన్నారు. 12గంటల పాటు కష్టపడి దీన్ని సిద్ధం చేసినట్లు  వివరించారు. అయోధ్యలో భూమిపూజ నేపథ్యంలో మందిరానికి పూజలు చేయనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఈ మందిరాన్ని బహూకరించాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని