ఎయిరిండియా విమానాల్లో వృద్ధులకు రాయితీ

తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే వృద్ధులకు ఎయిరిండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 60ఏళ్లకు పైబడి ఉన్న వ్యక్తులకు తమ టికెట్‌ రుసుములో 50శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు.

Published : 17 Dec 2020 01:26 IST

దిల్లీ: తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే వృద్ధులకు ఎయిరిండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 60 ఏళ్లకు పైబడి ఉన్న వ్యక్తులకు తమ టికెట్‌ రుసుములో 50శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది కేవలం దేశీయ విమానాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు ఎయిరిండియా తన వెబ్‌సైట్‌లోకి పేర్కొంది. భారతీయులై ఉండి, భారత్‌లో నివసిస్తున్న అరవై ఏళ్లకు పైబడిన వారు ఈ ఆఫర్‌కు అర్హులని తెలిపింది. ప్రయాణం చేసే నాటికి వారికి 60 ఏళ్లు ఉండాలని వారు పేర్కొంది. ఈ రాయితీ కేవలం టికెట్‌ రుసుముపైనే కాకుండా డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ ‌(డీజీసీఏ) ప్రకటించిన అన్ని రుసుములకూ కలిపే 50 శాతం రాయితీ అని తెలిపారు. టికెట్‌ బుక్‌ చేసుకొనే సమయంలోనే ప్రజలు వారి గుర్తింపు కార్డును అనుసరించి వయసును నమోదు చేయాలని తెలిపారు. వీటిలో ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఎయిరిండియా జారీ చేసిన సీనియర్‌ సిటిజన్‌ గుర్తింపు కార్డులు అనుమతిస్తామని తెలిపారు. తనిఖీ సమయంలో సరైన గుర్తింపుకార్డులు సమర్పించకపోతే టికెట్‌ పూర్తి రుసుమును చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు ఈ రాయితీని ఉపయోగించుకొని దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్లొచ్చన్నారు. ప్రయాణానికి మూడురోజులు ముందుగా టికెట్ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు.

ఇవీ చదవండి..

ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని