కర్నల్‌ సంతోష్‌ కుటుంబానికి బంజారాహిల్స్‌లో ఇంటి స్థలం

చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన సూర్యాపేటకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం చేయూత అందించింది

Updated : 22 Jul 2020 14:00 IST

హైదరాబాద్‌: చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన సూర్యాపేటకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం చేయూత అందించింది. షేక్ పెట్ మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన స్థలాన్ని కోరుకోవాలని సీఎం కేసీఆర్‌ గతంలో సూచించారు. సంతోష్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు బంజారాహిల్స్ లో స్థలం కేటాయించారు.

 బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 14లో కేబీఆర్‌ పార్క్‌ ఎదురుగా  రూ.20 కోట్ల విలువైన 711 గజాల ఇంటి స్థలాన్ని సంతోష్‌ బాబు కుటుంబానికి ప్రభుత్వం కేటాయించింది. బుధవారం ఉదయం ఆ స్థలాన్ని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి పరిశీలించారు. ఆ తర్వాత స్థలానికి సంబంధించిన పత్రాలను సంతోష్‌ భార్యకు కలెక్టర్‌ అందజేశారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని