ఎలుకపై సత్ఫలితాలిచ్చిన మోడెర్నా వ్యాక్సిన్‌

అమెరికన్‌ ఫార్మా సంస్థ మోడెర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ కొవిడ్‌---19 నుంచి ఎలుకకు రక్షణ కల్పించింది.  ఈ మేరకు చేసిన అధ్యయనాన్ని నేచర్‌ జనరల్‌లో ప్రచురించారు.

Updated : 29 Nov 2023 12:41 IST

వాషింగ్టన్‌: అమెరికన్‌ ఫార్మా సంస్థ మోడెర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ కొవిడ్‌-19 నుంచి ఎలుకకు రక్షణ కల్పించింది. ఈ మేరకు చేసిన అధ్యయనాన్ని నేచర్‌ జనరల్‌లో ప్రచురించారు. మూడు వారాల వ్యవధిలో ఒక మైక్రోగ్రామ్‌ మోతాదు గల ఎంఆర్‌ఎంఏ 1273 వ్యాక్సిన్‌ను ఎలుకకు ఇవ్వగా ఇది వైరస్‌ను చంపే వ్యాధి నిరోధకాలను ఎలుక శరీరంలో ప్రేరేపించినట్లు పరిశోధనలో తేలింది. రెండో ఇంజక్షన్‌ ఇచ్చిన 5 నుంచి 13వారాల తరువాత కరోనా సోకిన ఎలుకల్లో ఊపిరితిత్తులు, ముక్కులో వచ్చే ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదం తొలగినట్లు వెల్లడైంది. కరోనా వైరస్‌ ఉపరితలంపై ఉన్న స్పైక్‌ ప్రోటీన్‌ అణు నిర్మాణాన్ని గుర్తించేందుకు శాస్ర్తవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని మోడెర్నా వ్యాక్సిన్‌లో ఉపయోగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని