హిమాచలానికి వెళ్లాలనివుంది: ఆనంద్ మహీంద్రా

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఆసక్తికర పోస్టులు చేసే మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్‌ మహీంద్రా ఈసారి ఆహ్లాదకరమైన ఫొటోలను పంచుకున్నారు....

Published : 13 Dec 2020 01:41 IST

ముంబయా: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఆసక్తికర పోస్టులు చేసే మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్‌ మహీంద్రా ఈసారి ఆహ్లాదకరమైన ఫొటోలను పంచుకున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలిలో కురిసిన హిమపాతం ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకొని వెంటనే వెళ్లి అక్కడ గడపాలని ఉంది అని ఆనందం వ్యక్తం చేశారు. ట్రావెల్‌ సంస్థ క్లబ్ మహీంద్రా ఎండీ కవిందర్‌ సింగ్‌ షేర్‌ చేసిన కొన్ని ఫొటోలను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో పంచుకున్నారు. ‘మనాలిలోని మా వైట్‌ మీడోస్‌ రిసార్ట్‌ వద్ద కురిసిన హిమపాతం ఫొటోలను కవిందర్‌ సింగ్‌ పంచుకున్నారు. ఈ ఫొటోలను చూస్తుంటే థార్‌ వాహనంలో ఉత్తర భారతదేశం వైపు సాగిపోవాలనుంది’ అని ట్వీట్‌ చేశారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో కొద్దిరోజులుగా మంచు కురుస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు దాటడం లేదు. శుక్రవారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయి పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసింది. హిమాచల్‌లోని అత్యంత శీతల ప్రాంతమైన కీలాంగ్‌లో మైనస్‌ 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇవీ చదవండి...

ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌.. నోరెళ్లబెట్టిన నెటిజన్లు

పంజాబీ పాటకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని