అమరావతి రైతుల మహా పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా శంకుస్థాపన ఘట్టానికి గుర్తుగా రైతులు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు....

Updated : 22 Oct 2020 12:25 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా శంకుస్థాపన ఘట్టానికి గుర్తుగా రైతులు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాయపూడి, మందడం, గుంటూరు నుంచి పుణ్యస్థలి(ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం)వరకు రైతులు, మహిళలు మహా పాదయాత్ర  చేపట్టారు. గుంటూరు మదర్‌థెరిస్సా విగ్రహం నుంచి రైతులు తమ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రకు ఐకాస నేతలు తరలి వెళ్లారు. కొవిడ్‌ నిబంధనల మేరకు పాదయాత్ర చేసుకోవాలని పోలీసులు వారికి సూచించారు. రాష్ట్ర ప్రజల ఆశల రాజధానికి సమాధి వేయాలని చూస్తున్న సీఎం జగన్ ఇకనైనా మనసు మార్చుకోవాలని ఈ సందర్భంగా ఐకాస నేతలు, రైతులు హితవు పలికారు.

పుణ్యస్థలి వద్ద పలు కార్యక్రమాలు..
ఐదేళ్లు పూర్తైన సందర్భంగా పుణ్యస్థలి వద్ద పలు కార్యక్రమాలు చేపట్టినట్లు ఐకాస కన్వీనర్‌ సుధాకర్‌ తెలిపారు. ‘రాజధాని అమరావతి-నాటి వైభవం-నేటి దుస్థితి’ పేరుతో నిరసన చేపట్టి అమరావతిని కాపాడాలంటూ కేంద్రాన్ని వేడుకోనున్నట్లు చెప్పారు. ప్రధానిని అర్థిస్తూ ‘అమరావతి చూపు-మోదీ వైపు’ పేరుతో వినూత్న ప్రద్శన చేపట్టనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అమరావతి ఆవశ్యకత, రక్షణపై ప్రముఖులు సందేశాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రాత్రి దీక్షా శిబిరాల వద్ద ‘అమరావతి వెలుగు’ పేరుతో కాగడాల ప్రదర్శన చేపట్టినట్లు ఆయన వివరించారు. రైతులు, మహిళలు అంతా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని