బెయిల్‌ నిరాకరణపై సుప్రీంకోర్టుకు అర్ణబ్‌

రెండేళ్ల కిందట జరిగిన ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌, అతడి తల్లి ఆత్మహత్య కేసుకు సంబంధించి అరెస్టైన ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్‌ గోస్వామి సోమవారం బెయిల్‌ కోరుతూ బాంబే హైకోర్టును అభ్యర్థించారు

Published : 10 Nov 2020 15:10 IST

న్యూదిల్లీ : రెండేళ్ల కిందట జరిగిన ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌, అతడి తల్లి ఆత్మహత్య కేసుకు సంబంధించి అరెస్టైన ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్‌ గోస్వామి సోమవారం బెయిల్‌ కోరుతూ బాంబే హైకోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం అర్ణబ్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ అర్ణబ్‌ తరఫు న్యాయవాది నిర్నిమేశ్‌ దూబే మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆత్మహత్య కేసులో నవంబరు 4న ముంబయి పోలీసులు అర్ణబ్‌ నివాసంలో అతడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని