గ్రేటర్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలోని 150 డివిజన్లలో జరిగిన ఎన్నికలకు నేడు 30 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది.

Updated : 24 Sep 2022 14:35 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలోని 150 డివిజన్లలో జరిగిన ఎన్నికలకు నేడు 30 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. నేటి ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అన్ని పార్టీలు కలిసి మొత్తంగా 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

కొవిడ్‌ నేపథ్యంలో లెక్కింపును దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది. మాస్క్‌, శానిటైజన్ తప్పనిసరి చేయడమే కాకుండా బ్యాలెట్‌ బాక్సులు తీసుకొచ్చేవారు విధిగా పీపీఈ కిట్లు ధరించాలని ఆదేశించింది. అలాగే కౌంటింగ్‌ హాళ్లలోకి మొబైల్‌ ఫోన్లు తీసుకురాకూడదని.. పాస్‌ లేనివారిని అనుమతించేది లేదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుందని.. ఆ తర్వాత రెగ్యులర్‌ బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది. పోలింగ్‌ కేంద్రం పరిశీలకుడి అనుమతి తర్వాతే ఫలితాలు వెల్లడించాలని.. అనుమానిత ఓట్లకు సంబంధించి రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. అభ్యర్థులెవరైనా రీకౌంటింగ్‌ అవసరం అనుకుంటే ఫలితాలు వెల్లడించకముందే ఆర్వోకు తెలియజేయాలని సూచించింది. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చిన సందర్భంలో లాటరీ పద్ధతిలో ఫలితాన్ని ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని