లక్షణాలు లేనివారికి వెంటనే టెస్టులు చేయం..

యూరోప్‌, సౌత్‌ ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికుల్లో లక్షణాలు లేని వారికి వెంటనే ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులు చేయబోమని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Published : 25 Dec 2020 01:46 IST

మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబయి: యూరోప్‌, సౌత్‌ ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికుల్లో లక్షణాలు లేని వారికి వెంటనే ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులు చేయబోమని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా ఏర్పడిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కొవిడ్‌-19 టెస్టులు చేసి ఫలితం నెగెటివ్‌ వచ్చాకే ఇంటికి పంపుతున్నారు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే గంటల తరబడి చిక్కుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మహారాష్ట్ర సర్కారు ఒక ప్రకటన వెలువరించింది. ఈ క్రమంలో సంబంధిత ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఏ విధమైన కరోనా లక్షణాలు లేనట్లైతే వారిని ఇంటికి పంపుతామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాకపోతే వారు వారం రోజులు సంస్థాగత క్వారంటైన్‌ ఉండాలని తెలిపారు. ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉన్న హోటళ్లు తదితర ప్రాంతాల్లో 5, 7 రోజుల్లో వారికి టెస్టులు చేస్తామని వారు వెల్లడించారు. ఈ టెస్టుల్లో వారికి నెగెటివ్‌ వస్తే ఇంటికి పంపుతామన్నారు. కాకుంటే వారు మరో వారం పాటు ఐసోలేషన్‌లో ఉండాలని ఆ ప్రకటనలో తెలిపారు. ఎటువంటి లక్షణాలు లేకపోయినా ఫలితం పాజిటివ్‌ వచ్చిన వారిని 14 రోజులు సంస్థాగత క్వారంటైన్‌లోనే ఉంచుతామని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

‘కొత్త కష్టం’..: 8 గంటలకు పైగా ఎయిర్‌పోర్టుల్లోనే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని