రాష్ట్రపతి టూర్‌లో కలెక్టర్‌కు చేదు అనుభవం

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుమల పర్యటనలో చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సహా పలువురు అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. లోనికి అనుమతి

Published : 25 Nov 2020 01:41 IST

తిరుమల: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుమల పర్యటనలో చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సహా పలువురు అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. లోనికి అనుమతి లేదంటూ మహాద్వారం వద్ద తితిదే విజిలెన్స్‌ సిబ్బంది అడ్డుకోవడం కలకలం రేపింది. మహాద్వారం వద్ద రాష్ట్రపతి లోనికి వెళ్తుండగా జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా, ఇంటెలిజెన్స్‌ ఎస్పీ విజయారావు, సీఎంవో అధికారి ఆలస్యంగా అక్కడికి వచ్చారు. వారు లోపలికి వెళ్లకుండా తితిదే విజిలెన్స్‌ అధికారులు అడ్డుకున్నారు.  ఈ పరిస్థితుల్లో అధికారులు ముందుకు వెళ్లలేక కాసేపు అక్కడే ఉండిపోయారు. ఫోన్‌లో ఇతర అధికారులను సంప్రదించిన కలెక్టర్‌ సమస్యను వివరించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న తిరుపతి అదనపు ఎస్పీ సుప్రజ.. వారిని దగ్గరుండి లోపలికి తీసుకెళ్లారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని