వరద బాధితులకు రూ.5వేలు ఇవ్వాలి: భాజపా

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువన నుంచి వస్తున్న వరద కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ..

Updated : 18 Aug 2020 14:18 IST

ఏలూరు: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పోలవరం ముంపు గ్రామాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం పర్యటించారు. ముఖ్య నాయకులతో కలిసి అక్కడికి చేరుకున్న వీర్రాజు.. బలహీనంగా ఉన్న రింగ్‌ బండ్‌ గట్టు, కడెమ్మ స్లూయిజ్‌ ‌వద్ద గట్టుని పరిశీలించారు. అనంతరం వరదల కారణంగా పోలవరం సమీపంలో ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించి బాధితుల నుంచి నష్టం వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు రూ.5వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు