హోరెత్తిన తుంగభద్ర

తుంగభద్రకు వస్తున్న వరద ఉధృతి సాయంత్రానికి పెరగడంతో రాత్రి 8 గంటలకు ఆనకట్ట 18 గేట్లను పైకెత్తి 41,982 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. దిగువన ఉన్న బళ్లారి, కొప్పళ, రాయచూరు, కర్నూలు జిల్లాల్లో నదీతీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉదయం వరద ప్రమాణం 29 వేల క్యూసెక్కులుండటంతో 10 గేట్ల నుంచి నీటిని విడుదల చేసేవారు

Updated : 17 Aug 2020 23:43 IST

 

హొసపేట: తుంగభద్రకు వస్తున్న వరద ఉధృతి సాయంత్రానికి పెరగడంతో రాత్రి 8 గంటలకు ఆనకట్ట 18 గేట్లను పైకెత్తి 41,982 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. దిగువన ఉన్న బళ్లారి, కొప్పళ, రాయచూరు, కర్నూలు జిల్లాల్లో నదీతీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉదయం వరద ప్రమాణం 29 వేల క్యూసెక్కులుండటంతో 10 గేట్ల నుంచి నీటిని విడుదల చేసేవారు. సాయంత్రానికి వరద పోటెత్తింది. 18 గేట్లనూ ఎత్తేశారు. మంగళ, బుధవారాల్లో మరిన్ని గేట్లను ఎత్తి సుమారు 60 వేల క్యూసెక్కుల దాకా వరదను నదికి విడుదల చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని