‘హోంసిక్‌’ బెంగ తొలగడానికి.. ఎయిర్‌బాటిల్స్‌! 

ఒకదేశం నుంచి మరో దేశానికి వస్తువుల్ని రవాణా చేయడం చూసుంటాం. మరి బాటిళ్ల ద్వారా గాలిని ఒక దేశం నుంచి మరోదేశానికి చేరవేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? అంటే చాలా మంది లేదనే చెప్తారు కదా.

Published : 24 Dec 2020 00:54 IST

లండన్‌‌: ఒకదేశం నుంచి మరో దేశానికి వస్తువుల్ని రవాణా చేయడం చూసుంటాం. మరి బాటిళ్ల ద్వారా గాలిని ఒక దేశం నుంచి మరోదేశానికి చేరవేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? అంటే చాలా మంది లేదనే చెప్తారు కదా. కానీ యూకేకు చెందిన ‘మై బ్యాగేజ్‌’ అనే ఓ వస్తు రవాణా కంపెనీ అలాంటి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. విదేశాల్లో ఉంటున్న బ్రిటన్‌ జాతీయులకు స్వదేశంపై ఉన్న బెంగ(హోంసిక్‌)ను తొలగించేందుకు గాలి బాటిళ్లను చేరవేసే వింత నిర్ణయాన్ని అమలు చేస్తోంది. 

‘మై బ్యాగేజ్‌’ అనే సంస్థ వస్తువుల రవాణా సంస్థ ఇటీవల ఎయిర్‌ బాటిల్స్‌ సేవలను ప్రారంభించింది. ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, వేల్స్‌ దేశాల్లో స్వచ్ఛమైన గాలిని బాటిళ్లలో నింపి విదేశాల్లోని తమ వారికి చేరవేసే సేవలను ప్రారంభించింది. ఒక 500ఎంఎల్‌ బాటిల్‌ ధరను రూ.2,500గా విక్రయిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘విదేశాల్లో ఉండే మా దేశస్థులు తమ ఇంటితో కలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ బాటిల్స్‌కు అమర్చిన కార్క్‌ స్టాపర్‌ను తెరిచి వినియోగదారులు ఒక్క క్షణం శ్వాస తీసుకుని స్వదేశీ అనుభూతిని పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా వారు కొంతైనా స్వదేశంపై తమకున్న బెంగను(హోంసిక్‌ ఫీలింగ్స్‌) తీర్చుకోవచ్చు’ అని తెలిపారు. 

ఇదీ చదవండి

పియాజియో నుంచి రూ.1.26లక్షల స్కూటరు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని