
60 ఏళ్ల పాటు పిజ్జా ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ!
ఇంటర్నెట్ డెస్క్: తమ కుటుంబంలోకి కొత్త సభ్యుడిగా చిన్నారి ప్రవేశం ప్రతి జంటకూ ఆనందానుభూతిని కలిగించే విషయమే. మరి ఆ శిశువు పుట్టడంతోటే వారికి పదివేల డాలర్ల బహుమతితో పాటు.. అరవై ఏళ్ల పాటు పిజ్జా ఉచితంగా లభించే అవకాశం కూడా వస్తే..? ఏముందీ, వారు ఆనందంతో ఎగిరి గంతేస్తారు అంటున్నారా.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చెందిన ఓ జంట ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది. ఎలా అంటే..
ఇటలీలో పుట్టి, ప్రపంచ వ్యాప్తంగా కుర్రకారుకు నచ్చిన ఆహారమై కూర్చుంది.. పిజ్జా. కాగా, ప్రముఖ పిజ్జా సంస్థ ‘డోమినోస్ ఆస్ట్రేలియా’ స్థాపించి ఈ డిసెంబర్ 9కి అరవై ఏళ్లు అయిన సందర్భంగా .. తమ వినియోగదారుల కోసం ఓ ఆసక్తికరమైన పోటీని ప్రకటించింది. అదే రోజు ఆస్ట్రేలియాలో పుట్టిన ఓ లక్కీ చిన్నారి కుటుంబానికి నగదు బహుమతితో పాటు.. 60 ఏళ్లపాటు పిజ్జా ఉచితంగా అందిస్తామని ఆ సంస్థ తెలిపింది. అయితే ఆ శిశువు పేరు డోమినిక్ అని పెట్టాలనేది ఒకటే నిబంధన.
ఈ క్రమంలో సిడ్నీకి చెందిన క్లెమెంటైన్ ఓల్డ్ఫీల్డ్, ఆంటోనీ లాక్ అనే దంపతులు ఈ పోటీలో పాల్గొని విజేతలయ్యారు. వారికి డిసెంబర్ 9 తెల్లవారుఝామున 1:47 నిముషాలకు చిన్నారి జన్మించాడు.. అతనికి డోమినిక్ అని పేరుపెట్టారు. దీంతో వారికి డోమినోస్ నుంచి ప్రతి నెల 14 ఆస్ట్రేలియన్ డాలర్ల విలువైనగల పిజ్జా, తదితర ఆహార పదార్ధాలు 2080 వరకు ఉచితంగా లభించనున్నాయి. అంతేకాకుండా వీరికి 10,080 ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్ మనీ కూడా లభించింది. మరి, మన దేశంలోనూ ఇలాంటి పోటీ ఏదైనా ఉండే బాగుండును కదా!
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.