రాయపాటి నివాసంలో ముగిసిన సీబీఐ సోదాలు

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు ముగిశాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ రుణం ఎగవేత వ్యవహారంలో కెనరా బ్యాంక్‌ ఫిర్యాదు మేరకు...

Published : 19 Dec 2020 00:43 IST

గుంటూరు: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు ముగిశాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ రుణం ఎగవేత వ్యవహారంలో కెనరా బ్యాంక్‌ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా బెంగళూరు నుంచి వచ్చిన సీబీఐ బృందం గుంటూరులో తనిఖీలు చేపట్టింది. గుంటూరు, హైదరాబాద్‌లోని రాయపాటి నివాసాల్లో సోదాలు జరిగాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు చెందిన డ్యాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు. రాయపాటి వాంగ్మూలం నమోదు చేసుకున్న అనంతరం బ్యాంకు నోటీసులు, పలు పత్రాలను తమ వెంట తీసుకెళ్లారు. ట్రాన్స్‌ట్రాయ్‌తో రాయపాటికి ఉన్న సంబంధంపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. కెనరా బ్యాంకు, ట్రాన్స్‌ట్రాయ్‌ మధ్య ఉన్న రుణ వ్యవహారంపైనే విచారణ జరిగినట్లు రాయపాటి కుటుంబసభ్యులు తెలిపారు. సుమారు ఏడు గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని