అభ్యంతరకర పోస్టులపై సీబీఐ కేసులు

న్యాయమూర్తులు, కోర్టు తీర్పులపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Published : 16 Nov 2020 17:43 IST


 

అమరావతి‌: న్యాయమూర్తులు, కోర్టు తీర్పులపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేసింది. వీరితో పాటు మరొకరి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. గతంలో సీఐడీ సైబర్‌ క్రైం సెల్‌ నమోదు చేసిన కేసులనే యథాతథంగా తీసుకొని కేసులు నమోదు చేసినట్లుగా సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. నిందితులు ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తదితర మాధ్యమాల్లో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లు సీబీఐ గుర్తించింది. నిందితుల్లో ముగ్గురు విదేశాల నుంచి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు తెలిపింది. సీబీఐ
ఐటీ చట్టంలోని సెక్షన్ 154, 153 ఏ, 504, 505 ల ప్రకారం సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్‌లను కలుపుతూ ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేయనున్నట్లు సీబీఐ తెలిపింది.  ఈ మేరకు కేసులు నమోదు చేసినట్లు సీబీఐ ఎస్పీ విమలాదిత్య వెల్లడించారు. కేసు దర్యాప్తును సీబీఐ డీఎస్పీ శ్రీనివాస్‌రావుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని