చంద్రప్రభ వాహనంపై పద్మావతి అమ్మవారు 

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి  అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఆల‌య సమీపంలోని వాహ‌న మండ‌పంలో రాత్రి  అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది. క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదునారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు.

Published : 18 Nov 2020 02:06 IST

    

తిరుచానూరు: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఆల‌య సమీపంలోని వాహ‌న మండ‌పంలో రాత్రి  అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది. క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదునారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. వాహనసేవలో పెద్ద జీయ‌ర్‌స్వామి, చిన్న జీయ‌ర్‌స్వామి, ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి దంపతులు, జేఈవో ‌పి.బ‌పంత్‌కుమార్ దంప‌తులు, సివీఎస్వో గోపీనాథ్ జెట్టి, ఎఫ్ ఏ అండ్ సీఏవో బాలాజీ, సీఈ ర‌మేష్‌రెడ్డి ,వీఎస్వో బాలిరెడ్డి‌, ఆలయ డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్ర‌హ్మ‌ణ్యం, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, వేంపల్లి శ్రీనివాసులు, ఎం.జి.రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.19వ తేదీ గురువారం పంచమీ తీర్థం(చక్రస్నానం) నిర్వహించనున్నట్లు తితిదే ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని