ఆప్కో మాజీ ఛైర్మన్ ఇంట్లో సీఐడీ సోదాలు

ఆప్కో మాజీ ఛైర్మన్‌ గుజ్జల శ్రీనివాస్‌ ఇంట్లో భారీగా బంగారం, నగదును సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన ఇంటిలో ఈ ఉదయం నుంచి సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Published : 22 Aug 2020 01:31 IST

రూ.కోటి నగదు, 3 కిలోల బంగారం స్వాధీనం 

నేర విభాగం (కడప): ఆప్కో మాజీ ఛైర్మన్‌ గుజ్జల శ్రీనివాస్‌ ఇంట్లో భారీగా బంగారం, నగదును సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన ఇంటిలో ఈ ఉదయం నుంచి సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.కోటి పైగా నగదు, 3 కిలోల బంగారం, 2 కిలోల వెండి, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గుజ్జల శ్రీనివాస్‌ ఆప్కో ఛైర్మన్‌గా ఉన్న సమయంలో భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ అధికారుల దృష్టికి వెళ్లడంతో సోదాలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని