వైఎస్‌ఆర్‌ ఆసరా ప్రారంభించిన సీఎం జగన్‌

ఏపీలో వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 8.71 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 87 లక్షల మంది మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.

Updated : 11 Sep 2020 15:10 IST

అమరావతి: ఏపీలో వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 8.71 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 87 లక్షల మంది మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏప్రిల్‌ 11, 2019 నాటికి పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలను నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. మొత్తం రూ.27,168 కోట్లను ఆయా సంఘాల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీనిలో భాగంగా ఈరోజు తొలి విడతగా రూ.6,792 కోట్ల రుణమాఫీ నిధులను పొదుపు సంఘాలకు సీఎం జగన్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ డబ్బుతో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని మహిళలకు సూచించారు. వ్యాపారాలు చేయాలనుకునే వారికి ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తామన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న పలు కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానం చేస్తామని చెప్పారు. తక్కువ ధరలకు ఉత్పత్తులను అందించడంతోపాటు మార్కెటింగ్‌ చేసేందుకూ ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఆసరా పథకాన్ని సీఎం ప్రారంభించిన అనంతరం ఆయా జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పొదుపు సంఘాల మహిళలకు చెక్కులు అందజేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని