ఆరోగ్యశ్రీని నీరుగారిస్తే కఠిన చర్యలు:జగన్‌

ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేలా ఆస్పత్రులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

Updated : 04 Sep 2020 14:57 IST

అమరావతి: ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేలా ఆస్పత్రులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య మిత్రలతో హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేసి ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్‌ ఆస్పత్రులపై ఎలాంటి సమీక్ష చేస్తున్నామో, అలాగే అన్ని ఆరోగ్యశ్రీ అనుబంధ ఆస్పత్రులపైనా సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై సమీక్ష సందర్భంగా ఆరోగ్యశ్రీపై ఆయన పలు సూచనలు చేశారు.

కొవిడ్‌ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, కాల్‌సెంటర్ల పని తీరుపై అధికారులు మాక్‌ కాల్‌ చేసి తెలుసుకోవాలని సీఎం సూచించారు. ఆహారం, శానిటైజేషన్‌, వైద్య సదుపాయాల మీద రోగుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని ఆయా ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో 37,441 పడకలు ఖాళీగా ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఆయా ఆస్పత్రుల్లో 30,887 పోస్టులకు గానూ 21,673 తాత్కాలికంగా భర్తీ చేశామన్నారు. సాధారణ భర్తీలో 9,971 పోస్టులకు గానూ 4,676 పోస్టులు భర్తీ జరిగిందని.. మరో 10 రోజుల్లో మిగిలిన 5,295 నియమాకాల ప్రక్రియ పూర్తవుతుందని సీఎం జగన్‌కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని