త్వరలో రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’

తెలంగాణ రైతులకు శుభవార్త. త్వరలోనే రెండో విడత రైతుబంధు సహాయం అందివ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రగతిభవన్‌లో వ్యవసాయశాఖ

Published : 08 Dec 2020 01:52 IST

హైదరాబాద్‌: తెలంగాణ రైతులకు శుభవార్త. త్వరలోనే రెండో విడత రైతుబంధు సహాయం అందివ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రగతిభవన్‌లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. యాసంగి పెట్టుబడి కోసం రైతుబంధు సహాయం ఎప్పటి నుంచి ఇవ్వాలనే దానిపై అధికారులతో ఆయన చర్చించారు. ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ఈనెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో జమచేయాలని కేసీఆర్‌ సూచించారు. దీనికోసం రూ.7,300కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖను సీఎం ఆదేశించారు. తొలుత విస్తీర్ణం తక్కువగా ఉన్న రైతులకు రైతుబంధు అందించాలని..క్రమంగా ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ఇవ్వాలని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని