‘సాయం చేయాల్సింది పోయి కోత విధిస్తారా?’

రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారాన్ని తగ్గించడం సరికాదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా గతంలో జీఎస్టీకి మద్దతిచ్చామని

Published : 01 Sep 2020 15:44 IST

జీఎస్టీ పరిహారంపై ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారాన్ని తగ్గించడం సరికాదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా గతంలో జీఎస్టీకి మద్దతిచ్చామని చెప్పారు. జీఎస్టీ పరిహారం చెల్లింపు వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీకి కేసీఆర్‌ లేఖ రాశారు. చట్ట ప్రకారం రెండునెలలకోసారి బకాయిలు చెల్లించాలన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌లో రాష్ట్ర ఆదాయం 83శాతం పడిపోయిందని లేఖలో పేర్కొన్నారు. ఆదాయం తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. వేతనాలు, ఖర్చుల కోసం అప్పులపై ఆధారపడాల్సి వస్తోందని సీఎం చెప్పారు. 

రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలంటూ కేంద్రం చెప్పడం సమంజసం కాదని కేసీఆర్‌ అన్నారు. కేంద్రానికి ఆర్థికపరమైన వెసులుబాటులు ఎన్నో ఉంటాయని.. రాష్ట్రాలకు ఆ పరిస్థితి ఉండదన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు కేంద్రం అదనంగా సాయం చేయాల్సిందిపోయి ఈ విధంగా కోత విధించడం తగదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని.. ఈ  అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చట్ట ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం మొత్తాన్ని చెల్లించాలని ప్రధానిని సీఎం కేసీఆర్‌ కోరారు. కరోనాపై పోరాడుతున్న రాష్ట్రాలకు కేంద్రం ఆర్థికంగా చేయూత అందివ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని