
Updated : 02 Sep 2020 10:48 IST
వైఎస్ఆర్ సమాధి వద్ద సీఎం జగన్ నివాళి
కడప: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద అంజలి ఘటించారు. సీఎం జగన్, వైఎస్ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం వైఎస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘ నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలు, పథకాలకు కాదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు.’’ అని పోస్టు చేశారు.
Advertisement
Tags :