ఆసుపత్రిలో వైద్యంపై కరోనా బాధితుడి సెల్ఫీ వీడియో

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మారానికి చెందిన ఓ కరోనా బాధితుడు అక్కడ వైద్యంపై సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనకు సరైన వైద్యం అందించడం లేదంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ..

Published : 29 Jul 2020 15:10 IST

నిజామాబాద్‌ జిల్లాలో ఘటన

నిజామాబాద్‌: నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మారానికి చెందిన ఓ కరోనా బాధితుడు అక్కడ అందుతున్న వైద్యంపై సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనకు సరైన వైద్యం అందించడం లేదంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. శ్వాస ఆడక వెంటిలేటర్‌ పెట్టమని అడిగితే మాత్ర ఇచ్చి పంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, తాను ఇక్కడ ఉండలేనని చికిత్స కోసం వెంటనే హైదరాబాద్‌కు పంపడమో లేకపోతే ఇంకా ఏదైనా చర్య తీసుకోవాలని వేడుకున్నాడు. ‘‘నేను ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను. ఆ రోజు టెస్టులు చేస్తామని పైకి తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్యులను సంప్రదించేందుకు అనుమతి అడుగుతున్నాను. సిస్టర్లు వస్తున్నారు, వెళ్తున్నారు. నాకు టెస్టులు చేయలేదు. నిన్న రాత్రి 1.30గంటలకు వచ్చి కొవిడ్‌ పరీక్షలు చేశారు. విపరీతంగా జ్వరం పెరుగుతోంది’’ అంటూ తన ఆవేదన తెలియజేశాడు. 
దీనిపై వైద్యాధికారులను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని చెప్పారు. షుగర్‌ ట్యాబ్‌లెట్‌, ఇన్సులిన్‌ విషయంలో బాధితుడికి, డ్యూటీ వైద్యుడికి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగిందన్నారు. కోపంతో బాధితుడు వీడియో తీసి పోస్టు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమా రాజు వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని