
ప్రపంచానికే హైదరాబాద్ ఆదర్శం:అంజనీకుమార్
హైదరాబాద్: గణశ్ నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మండపాల నిర్వాహకులు, సిటీ పోలీసులు ఎంతో కష్టపడ్డారన్నారు. సామరస్యంగా వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని చెప్పారు. మత సామరస్యంలో ప్రపంచానికే హైదరాబాద్ ఆదర్శంగా నిలించిందన్నారు.
నగరంలో ఈసారి నిమజ్జనం నిరాడంబరంగా సాగిన విషయం తెలిసిందే. భారీ గణనాథులు లేకపోవడంతో పెద్దపెద్ద వాహనాలు కానరాలేదు. వ్యక్తిగత వాహనాలకే జనం ప్రాధాన్యం ఇచ్చారు. దుర్గం చెరువు కుంటలో మంగళవారం 30 మాత్రమే నిమజ్జనమయ్యాయని అధికారులు తెలిపారు. గతేడాది ఇక్కడ 300 వరకు విగ్రహాలు వచ్చాయి. సరూర్‌నగర్ చెరువులో గతేడాది ఇక్కడ 5,640 విగ్రహాలు నిమజ్జనం కాగా ఈసారి 1200 నిమజ్జనం అయినట్లు అధికారులు పేర్కొన్నారు. సఫిల్‌గూడ చెరువులో గతేడాది 1000 కాగా ఈసారి 30కే పరిమితమయ్యాయి. కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువులో గతేడాది 4000 వరకు నిమజ్జనమవగా ఈసారి పదుల సంఖ్యలో అయ్యాయని అధికారులు చెప్పారు. ప్రగతినగర్, అంబీర్ చెరువులో చిన్న విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.