ఆర్థికసాయం పంపిణీపై సీఎస్‌ సమీక్ష

నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అందించాల్సిన ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాల్సిందిగా

Published : 22 Oct 2020 01:17 IST

హైదరాబాద్‌: నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అందించాల్సిన ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్థిక సాయం పంపిణీపై సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సాయం పంపిణీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతి సర్కిల్‌కి 10 బృందాలు చొప్పున మొత్తం 300, శివారు మున్సిపాలిటీల్లో 950 బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, సీడీఎంఏ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే జిల్లాల నుంచి అధికారులను సమకూర్చుకోవాలని సీఎస్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు