వివేకా కేసు:ఆర్థికలావాదేవీల కోణంలో విచారణ

మాజీ మంత్రి వై.ఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 16వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులను సీబీఐ విచారిస్తోంది.

Published : 29 Sep 2020 01:26 IST

కడప: మాజీ మంత్రి వై.ఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 16వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని సీబీఐ అధికారులు ఇవాళ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కేసులో ఆర్థిక లావాదేవీల కోణంలోనే సీబీఐ ఎక్కువగా దృష్టి సారించింది. మున్నాతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు అప్పులు ఇచ్చారు అన్నదానిపై సీబీఐ కూపీ లాగుతోంది. నిన్న కడపకు చెందిన ముగ్గురు చెప్పుల షాపు డీలర్లను విచారించిన సీబీఐ.. ఇవాళ కూడా మున్నాతో దగ్గర సంబంధం ఉన్న వ్యక్తిని విచారిస్తున్నట్లు సమాచారం. 3 నెలల నుంచి పులివెందులలో చెప్పుల దుకాణాన్ని మూసివేసినా.. మున్నా బ్యాంకు లాకరులో రూ.48 లక్షల నగదు, 25 తులాల బంగారం ఎలా ఉందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని