
స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు యథాతథం
కేంద్ర హోం శాఖ వెల్లడి
దిల్లీ: ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ‘ఆత్మ నిర్భర్ భారత్’కు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. దేశంలో కరోనా ఉద్ధృతి ఉన్నప్పటికీ కార్యక్రమాలను రద్దు చేయడం లేదని స్పష్టం చేసింది. సామాజిక దూరం, పారిశుద్ధ్యం పాటించడం, మాస్క్‌లు ధరించడం కొనసాగిస్తూనే వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకోవాలని కేంద్రం సూచించింది.
ఇటీవల వైరస్ నుంచి కోలుకున్నవారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేక ఆహ్వానం పంపి వారిని ప్రోత్సహించాలని సూచించింది. గవర్నర్‌లు నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమం కూడా యథాతథంగా నిర్వహించుకోవచ్చని కేంద్రం తెలిపింది. కానీ.. కచ్చితంగా నిబంధలను పాటించాలని కోరింది. మిలిటరీ బ్యాండ్లు రికార్డ్ చేసిన వీడియోలను పెద్ద తెరలపై ప్లే చేయాలని సూచించింది. ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగం ఉంటుందని.. అయితే.. పరిమిత సంఖ్యలోనే ఆహ్వానితులు ఉంటారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.