శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి షెకావత్‌

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.వీఐపీ ప్రారంభదర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు తితిదే ఛైర్మన్‌...

Updated : 03 Oct 2020 13:14 IST

తిరుమల: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.వీఐపీ ప్రారంభదర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు తితిదే ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కూడా షెకావత్‌తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

రాష్ట్రానికి సహకారమందిస్తాం: షెకావత్‌

తిరుమలలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకారం అందిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పాపవినాశనం జలాశయాన్ని ఆయన పరిశీలించారు. యాత్రికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇక్కడ నీటి అవసరం కూడా పెరుగుతోందని అన్నారు. కల్యాణి డ్యాం నుంచి ఇక్కడికి నీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, దీని కోసం కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరిందని చెప్పారు. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.అంతేకాకుండా తిరుపతిలో బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి కేంద్రం నుంచి సహకారం అందిస్తామని షెకావత్‌ హామీ ఇచ్చినట్లు మంత్రి అనిల్‌, తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని